హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
గాన సరస్వతి, పద్మభూషణ్ పి.సుశీల 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్లోబల్ టాలెంటెడ్ మ్యూజికల్ ఆర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘శతగీతాల స్వరార్చన’ నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళావేంకట దీక్షితులు వేదికలో ఈ సంగీత కార్యక్రమం జరిగింది.
సుశీల ఆలపించిన మధుర గీతాలను గుర్తుచేసుకుంటూ గాయనీగాయకులు స్వరార్చన సమర్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిర్వహించిన కార్యక్రమాన్ని ఆమె జన్మదినోత్సవానికి సంగీత కానుకగా అంకితం చేశారు.
ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ బాలు నాగశివరామ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సుశీల గాన వైభవాన్ని స్మరించుకునేలా శతగీతాల కార్యక్రమాన్ని రూపొందించారు. సంగీత ప్రియులకు సుపరిచితమైన ఆమె పాటలను ఒకే వేదికపై వినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు అందించారు.






