బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,716+2.05%
NIFTY25,768+2.14%
22K₹1,12,787/10g+1.24%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

యువ సంగం ద్వారా అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకున్న తెలంగాణ బృందం అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో యువ ప్రతినిధుల ముఖాముఖి

nagendraఆదివారం, 11 అక్టోబర్ 2026 · 1:53 AM7 వీక్షణలుtrinetnews.com
యువ సంగం ద్వారా అస్సాం సాంస్కృతిక వారసత్వాన్ని తెలుసుకున్న తెలంగాణ బృందం అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో యువ ప్రతినిధుల ముఖాముఖి

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 10 (ట్రైనెట్ న్యూస్) :

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యా విభాగం నిర్వహిస్తున్న యువ సంగం ఏడో విడతలో తెలంగాణ యువ ప్రతినిధుల బృందం అస్సాం సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను తెలుసుకుంది.

భారత యువత మధ్య సాంస్కృతిక, భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం. జంటలుగా అనుసంధానించిన 20 రాష్ట్రాలు, ఉన్నత విద్యాసంస్థల ద్వారా నిర్వహించే పరస్పర సందర్శనల్లో యువత వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారసత్వం, సంప్రదాయాలు, విద్యారంగ పరిస్థితులు, అభివృద్ధి విజయాలను తెలుసుకుంటారు.

కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం నేతృత్వంలోని తెలంగాణ బృందం అక్టోబర్ 4న గువాహటికి చేరుకుంది. బృందానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి ఘన స్వాగతం పలికింది.

అక్టోబర్ 5న యువ ప్రతినిధులు యోగా సాధనతో తమ రోజును ప్రారంభించారు. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథాన్ని పెంపొందించే ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సంప్రదాయ విజ్ఞానం, సాంస్కృతిక వారసత్వంలోని ముఖ్యమైన అంశాన్ని అనుభవించే అవకాశం లభించింది.

అదే రోజు బృందం అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యతో ముఖాముఖి చర్చలో పాల్గొంది. అస్సాం వారసత్వం, సంప్రదాయాలు, సాంస్కృతిక ప్రాధాన్యంపై యువ ప్రతినిధులు అవగాహన పొందారు. దేశవ్యాప్తంగా యువత మధ్య సంబంధాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఈ సమావేశం చాటింది.

భారతదేశ వైవిధ్యాన్ని అనుభవించడం, సొంత రాష్ట్రానికి వెలుపల ఉన్న సమాజాలతో మమేకం కావడం, దేశ ఉమ్మడి సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించుకోవడం వంటి యువ సంగం లక్ష్యాలకు తెలంగాణ–అస్సాం పరస్పర సందర్శన దోహదపడింది.

ఇలాంటి కార్యక్రమాలు యువతకు కొత్త విషయాలను తెలుసుకునేందుకు, పరస్పర సంబంధాలను ఏర్పరచుకునేందుకు, చిరస్మరణీయ అనుభవాలను పొందేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :