Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,593-1.09%
NIFTY22,232-1.44%
HYD 22K₹1,37,699/10g-0.30%
भाषाएँ

Cultural

सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

सामाजिक कल्याण को कविता का माध्यम बनाने वाले श्री श्री, हैदराबाद, चिक्कड़पल्ली, ट्राइनेट न्यूज, 8 अक्टूबर: सामाजिक चेतना और कल्याण के उद्देश्य से कविता को साधन बनाने वाले श्री श्री पीढ़ियां बदलने के बाद भी साहित्य में ही नहीं

Staff Reporter8 October 2026, 2:55 PM6 व्यूtrinetnews.com
सामाजिक कल्याण के लिए ही श्री श्री की कविता: न्यायमूर्ति विश्वेश्वर राव

Share this story

Share link keeps your language (?lang=)

సామాజిక శ్రేయస్సు కి కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ

హైదరాబాద్, చిక్కడపల్లి, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 8: సామాజిక చైతన్యానికి శ్రేయస్సు లక్ష్యంగా కవిత్వాన్ని సాధనం చేసుకున్న శ్రీ శ్రీ తరాలు మారినా సాహిత్యం లోనే కాక ప్రజా ఉద్యమాలు లోనూ నిలిచి ఉంటారని హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వేశ్వర రావు అన్నారు శ్రీ త్యాగరాయ గానసభ లోని గుండవరపు హనుమంత రావు కళా వేదిక పై గాన సభ నిర్వహణలో జరుగుతున్న ఎందరో మహానుభావులు కార్యక్రమ పరంపర లో భాగంగా మహా కవి శ్రీ శ్రీ యాది లో సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ విశ్వేశ్వర రావు మాట్లాడుతూ తెలుగు సాహిత్యం లో భావ కవితా యుగానికి రాయప్రోలు సుబ్బారావు బాటలు వేస్తే అభ్యుదయ సాహితీ యుగ కర్త గురజాడ కాగా వారి అడుగు జాడల్లో ముందు భావ కవి గా తన రచనా ప్రస్తానం ప్రారంభించిన శ్రీ శ్రీ మహా ప్రస్తానం కావ్యం తో అభ్యుదయ కవి గా ప్రజల పక్షాన నిలిచి ప్రజా కవి గా గుర్తింపు నాడు పొందారు అని వివ రించారు రచయిత్రి శైలజా మిత్ర మాట్లాడుతూ మహా కవి శ్రీ శ్రీ సాహిత్యం తో ప్రభావితులై సాహిత్యం రాసిన వారు ఎందరో ఉన్నారు అని చెప్పారు ఆయన రాసిన సినీ పాటలు ప్రత్యేకత తో సందర్భానుసారం సామ్య వాదం భావనలతో ఉంటాయి అని పాడవోయి భారతీయుడా పాట ఇందుకు మంచి ఉదాహరణ అని చెప్పారు గాన సభ అధ్యక్షుడు కళా జనార్థన మూర్తి అధ్యక్షత వహించిన వేదిక పై గాయనీ మణులు ఆమని శోభా రాణి ప్రముఖ వ్యాఖ్యాత మోహన కృష్ణ పాల్గొన్నారు

यह भी पढ़ें

వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి రాష్ట్రం సిద్ధం రాష్ట్ర, కేంద్ర వాటాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం

వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభానికి రాష్ట్రం సిద్ధం రాష్ట్ర, కేంద్ర వాటాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం

లబ్ధిదారుల ఎంపికపై కేంద్ర మార్గదర్శకాల కోసం ఎదురుచూపులు చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరేలా వ్యవసాయ యాంత్రీకరణ పథకం: మంత్రి తుమ్మల - రైతుకు నచ్చిన కంపెనీ నుంచి వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసే వెసులుబాటు - సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ - ఎస్సీ, ఎస్టీ రైతులకు 60 శాతం.. బీసీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ - ఎఫ్‌పీఓలను కస్టమ్ హైరింగ్ సెంటర్లుగా వినియోగించే అవకాశాలపై అధ్యయనం చేయాలి: మంత్రి తుమ్మల - రైతుల అభిప్రాయాలతో యాంత్రీకరణ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి: మంత్రి తుమ్మల

और पढ़ें →