బుధవారం30 సెప్టెంబర్ 2026హైదరాబాద్

SENSEX72,480-1.50%
NIFTY22,620-1.92%
22K₹1,38,667/10g-2.46%
భాషలు

సాంస్కృతికం

అమెరికాలో ఘనంగా ఎస్పీ బాలు ఆరవ వర్ధంతి వేడుకలు

అంతర్జాల వేదిక గా విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం వర్థంతి న్యూయార్క్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30:అమెరికా లోని న్యూ యార్క్ నగరం లో విఖ్యాత గాయకుడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు స్థాపిం

Staff Reporter30 September 2026, 12:21 PM7 చూసులుtrinetnews.com
అమెరికాలో ఘనంగా ఎస్పీ బాలు ఆరవ వర్ధంతి వేడుకలు

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అంతర్జాల వేదిక గా విఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం వర్థంతి

న్యూయార్క్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30:అమెరికా లోని న్యూ యార్క్ నగరం లో విఖ్యాత గాయకుడు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం అభిమానులు స్థాపించిన ఎస్ పి బి మ్యూజిక్ అకాడమీ నిర్వహణలో అంతర్జాల వేదిక గా బాల సుబ్రహ్మణ్యం అరవ వర్ధంతి నిర్వహించారు ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బాలు తెలుగు భాష తో పాటు తమిళ హిందీ కన్నడ మలయాళం తదితర భాషలో గానం చేసి ఆయా ప్రాంతాల వారు తమవాడే అనేంతగా పాటను తన గాన మాధుర్యం తో ఆవిష్కరించారు అని చెప్పారు ఆయనకు మృత్యువు తొందరలో వచ్చిందని ఇంకా కొంత కాలం ఉంటే తెలుగు భాషకు ఆయన పాట మాట ద్వారా ఎంతో మేలు జరిగేది అని పేర్కున్నారు వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు మాట్లాడుతూ ఘంటసాల తరువాత బాలు ఆయన స్థానం భర్తీ చేశారు అని బాలు తరువాత అంతటి గాయకుడు ఇంకా రాలేదు అని చెప్పారు ప్రముఖ గాయకులు రామా చారి నేమాని పార్థసారధి సందీప్ వినోద్ ధీరజ్ లు బాలు తో తమకు వున్న అనుబంధం గుర్తు చేసుకుని ఆయన పాటలను మధురం గా ఆలపించారు గీత రచయిత రస రాజు పాల్గొన్న కార్యక్రమానికి అకాడమీ అధ్యక్తడు శ్రీనివాస్ గూడూరు సంస్థ కార్యక్రమాలు తెలిపారు చైర్మెన్ హారి ఇప్పనపల్లి స్వాగతం పలికగా బుర్ర రాజేశ్వరి సుజాత లావణ్య , శ్రీనివాస్ రెడ్డి రాము గేదెల చంద్ర రవి అయ్యగారి కుమారి రాణీ తదితరులు కార్యక్రమ నిర్వహణ చేశారు. వివిధ దేశాలకు చెందిన తెలుగు ప్రతినిధులు తమ సందేశాలు తెలిపారు

ఇవి కూడా చదవండి

ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు.. వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలని డిమాండ్

ఫిలిం ఫెడరేషన్‌పై భగ్గుమన్న పలు సినీ సంఘాలు.. వల్లభనేని అనిల్‌ను జైలులో పెట్టాలని డిమాండ్

ఫిలిం ఫెడరేషన్‌పై భ‌గ్గుమ‌న్న ప‌లు సినీ సంఘాలు ▪️ చిత్రపురి హౌసింగ్ సొసైటీలో భారీ అక్రమాల ఆరోపణలు ▪️ సినీ యూనియన్లను విచ్ఛిన్నం చేస్తున్నారంటూ విమర్శలు ▪️ వ‌ల్ల‌భ‌నేని అనిల్‌ను వ‌దిలిపెట్ట‌బోమంటూ తీవ్ర హెచ్చ‌రిక‌

మిగతా చదవండి →

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

ఇండియన్ బ్యాంక్ రిటైరీల సంఘం రజతోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఇండియన్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో పద్మజా చుండూరు విశిష్ట అతిథిగా సినీ నటుడు తనికెళ్ల భరణి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రత్యేక ప్రదర్శన హైదరాబాద్, సెప్టెంబర్ 3

మిగతా చదవండి →

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ

నాచారం ఎస్సై పల్లా ప్రభాకర్‌రెడ్డి పదవీ విరమణ 37 ఏళ్ల సుదీర్ఘ సేవలో అనేక అవార్డులు, రివార్డులు నాచారం, సెప్టెంబర్ 30 (ట్రైనెట్ న్యూస్): నాచారం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్‌ఇన్‌స్పెక్టర్ పల్లా ప్రభాకర్‌రెడ్

మిగతా చదవండి →

విఖ్యాత గాయని సుశీలకు 'స్వర సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం

విఖ్యాత గాయని సుశీలకు 'స్వర సామ్రాజ్ఞి' బిరుదు ప్రదానం

విఖ్యాత గాయని సుశీల స్వర సామ్రాజ్ఞి హైదారాబాద్, రవీంద్రభారతి, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబరు 30: విఖ్యాత నేపథ్య గాయని డాక్టర్ పి సుశీల లను గాంధీ స్పూర్తి పురస్కారం తో పాటు స్వర సామ్రాజ్ఞి బిరుదుతో సత్కార సభ రవీంద్ర భారతి ప్

మిగతా చదవండి →