రేపటి నుంచి ‘ప్రజల బతుకమ్మ–2026’ సంబరాలు
రవీంద్రభారతిలో ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభం
అక్టోబరు 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
హైదరాబాద్, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్): తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజల బతుకమ్మ–2026’ వేడుకలు అక్టోబరు 10 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. రవీంద్రభారతిలో అక్టోబరు 10న సాయంత్రం 5 గంటలకు ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబరు 11 నుంచి 17 వరకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి రవీంద్రభారతిలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేడుకలకు భాషా సాంస్కృతిక శాఖ ఆహ్వానం పలికింది. అక్టోబరు 18న సాయంత్రం 5 గంటలకు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. అమరవీరుల స్మారకం నుంచి ట్యాంక్‌బండ్ వరకు వేయి బతుకమ్మలతో వేడుకలు, కళారూపాల ప్రదర్శన, అనంతరం బతుకమ్మల నిమజ్జనం జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆహ్వాన పత్రం విడుదల చేశారు.





