బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సాంస్కృతికం

చిన్నారుల్లో సంగీతాభిరుచిని పెంపొందించాలి: దీపక్ జాన్

చిన్నారుల్లో సంగీతాభిరుచిని పెంపొందించాలి: దీపక్ జాన్ ఘనంగా నిస్సి మ్యూజిక్ అకాడమీ పదో వార్షికోత్సవ వేడుకలు చిన్నారుల సంగీత, నృత్య ప్రదర్శనలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19: సంగీత

Sai Rapoluగురువారం, 19 నవంబర్ 2026 · 1:50 PM15 వీక్షణలుtrinetnews.com
చిన్నారుల్లో సంగీతాభిరుచిని పెంపొందించాలి: దీపక్ జాన్

చిన్నారుల్లో సంగీతాభిరుచిని పెంపొందించాలి: దీపక్ జాన్

ఘనంగా నిస్సి మ్యూజిక్ అకాడమీ పదో వార్షికోత్సవ వేడుకలు

చిన్నారుల సంగీత, నృత్య ప్రదర్శనలతో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 19:

సంగీతంతో మానసిక ప్రశాంతతతో పాటు అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిస్సి మ్యూజిక్ అకాడమీ పదో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దీపక్ జాన్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో సంగీతం పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సంగీతం చిన్నారుల్లో సృజనాత్మకతను, ఏకాగ్రతను, క్రమశిక్షణను పెంపొందించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

నిస్సి మ్యూజిక్ అకాడమీ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు వివిధ రకాల సంగీత వాయిద్యాల్లో శిక్షణ అందిస్తూ కళారంగానికి విశేష సేవలు అందించడం అభినందనీయమన్నారు. పదేళ్లుగా సంగీత విద్యను ప్రోత్సహిస్తూ చిన్నారుల ప్రతిభను వెలికితీస్తున్న సంస్థ నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా పదేళ్లలోపు చిన్నారులు తబలా, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్ వంటి సంగీత వాయిద్యాలతో చేసిన ప్రదర్శనలు ఆహూతులను అబ్బురపరిచాయి. పాశ్చాత్య సంగీత ప్రదర్శనలతో పాటు కూచిపూడి, భరతనాట్యం వంటి సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారుల ప్రతిభను చూసి అతిథులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ సామ్సన్, అమృతవాహిని డైరెక్టర్ పి. సుధాకర్, కర్ణాటక గాయకుడు రిచర్డ్, ఫ్లయిన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకురాలు అనితా రమేష్, న్యాయవాది డాక్టర్ ఏఎస్ కమల ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :