Sunday11 October 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
भाषाएँ

Cultural

MVS Haranatha Rao की याद में 'नैवेद्यम' नाटक का मंचन

The play 'Naivedyam' was performed in Anantapur under the joint auspices of Jaya Arts Hyderabad and Lalitha Kala Parishad Anantapur, paying tribute to late film writer M.V.S. Haranath Rao on his death anniversary.

Staff Reporter10 October 2026, 2:10 PM9 व्यूtrinetnews.com
MVS Haranatha Rao की याद में 'नैवेद्यम' नाटक का मंचन

Share this story

Share link keeps your language (?lang=)

నవ్వించిన నైవేద్యం

అనంతపురం, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 10: సినీ రచయిత యం.వి.ఎస్. హరనాథ రావు, వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.. జయా ఆర్ట్స్ హైదరాబాద్, లలిత కళా పరిషత్ అనంతపురం సంయుక్త నిర్వహణలో నైవేద్యం నాటికను ప్రదర్శించారు. ఆకలితో ఉన్న పేదవాడికి పిడికెడు మెతుకులు కూడా పెట్టించలేని మానవత్వం, దానిని ఆపలేని దైవత్వం మధ్య నడిచే కథాంశంతో ప్రేక్షకులను అలరించింది. అందరినీ కడుపుబ్బా నవ్వించి, అనంతరం ఆలోచింప జేసింది. ఇప్పటివరకు 45 నాటికలకు దర్శకత్వం వహించిన శ్రీజ 46 వ నాటికగా తనకు తనకు ఎంతో ఇష్టమైన ఈ నాటికకు దర్శకత్వం వహించడం సంతోషంగా ఉండడమే కాదు, హరనాథ రావు కి నివాళి అర్పించడమే అన్నారు.లలిత కళా పరిషత్ సెక్రటరీ గాజుల పద్మజ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, నాటిక ప్రదర్శనను విజయవంతం చేశారు. సినీనటులు, రంగస్థల దర్శకులు వెంకట్ గోవాడ ఈ కార్యక్రమానికి అతిధిగా హాజరయ్యారు. అనంతరం దర్శకురాలు శ్రీజ సాదినేనిని ఘనంగా సత్కరించారు.

यह भी पढ़ें