భారతీయ కళలను కాపాడుకోవాలని అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్ అన్నారు. శ్రీ రాజా రాజేశ్వర భరత కళా సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవం, శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను బిర్లా సైన్స్ సెంటర్, భాస్కర ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ రాందాస్ తేజావత్, కూచిపూడి నాట్య గురువు డాక్టర్ పసుమర్తి శేషు బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రముఖ గురువులు పి. పూర్ణిమ నాయుడు, సుప్రియ సతీష్, గురు కె. సందీప్, దుర్గా భవాని యారబ్రోలు, ఎ.కె. రంజు ప్రవీణ, గాయత్రి, ఎం. కవిత, తిమ్మన శ్వేత నాయుడు శిష్య బృందాలు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేడుకలకు సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా గంగాధర నికిత శెట్టి వ్యవహరించారు. నిర్వాహకులు, సంస్థ వ్యవస్థాపకులు భరత్ బాహు, గంగాధర రాజశేఖర్ పాల్గొన్నారు.






