Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,495-1.23%
NIFTY22,206-1.55%
HYD 22K₹1,37,846/10g-0.20%
भाषाएँ

Cultural

अక్కినేनी की 102वीं जयंती पर मनमोहक रही ‘पाडोवोయి भारतीयूडा...’ संगीत संध्या

अక్కినేनी की 102वीं जयंती के अवसर पर किन्नरे आर्ट थिएटर्स के तत्वावधान में भव्य रूप से आयोजित हुई फिल्मी संगीत संध्या। हैदराबाद, ट्राइनेट न्यूज, 22 सितंबर।

Staff Reporter22 September 2026, 4:01 PM9 व्यूtrinetnews.com
अక్కినేनी की 102वीं जयंती पर मनमोहक रही ‘पाडोवोయి भारतीयूडा...’ संगीत संध्या

Share this story

Share link keeps your language (?lang=)

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ సంగీత విభావరి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతిని పురస్కరించుకుని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాడవోయి భారతీయుడా...’ అక్కినేని సినీ సంగీత విభావరి మంగళవారం ఘనంగా జరిగింది.

హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్కినేని నటించిన చిత్రాల్లోని చిరస్మరణీయ గీతాలను ప్రముఖ గాయనీ గాయకులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. పాతతరం సినీ సంగీత మాధుర్యాన్ని గుర్తుచేసిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

కార్యక్రమానికి పూర్వ జిల్లా న్యాయమూర్తి, భారత సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ నేరెళ్ళ మల్లాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ విజ్ఞాన విశారద శ్రీ యస్.వి. రామారావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని శ్రీ వై.ఎస్. రామకృష్ణ సమర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. నటనలో సహజత్వం, క్రమశిక్షణ, కళారంగంపై అంకితభావంతో ఆయన తరతరాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అక్కినేని చిత్రాల్లోని సుప్రసిద్ధ గీతాలతో సాగిన సంగీత విభావరి ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది.

यह भी पढ़ें

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी.... - पार्टी को मजबूत करने के लिए काम करूंगी: सीएच भाग्यलक्ष्मी.... ट्राइनेट न्यूज, हैदराबाद 07 अक्टूबर: भाजपा सेंट्रल जिला महिला मोर्चा

और पढ़ें →

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

और पढ़ें →