E-Paperఈ-పేపర్PDF · Clip · Archive
భాషలు

ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

మంగళవారం22 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:05 amసూర్యాస్తమయం 6:12 pm

మంగళవారం

22 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:05 am

సూర్యాస్తమయం 6:12 pm

SENSEX74,529+0.26%
NIFTY23,329+0.48%
హైదరాబాద్ 22K₹1,43,550/10g-0.58%
హైదరాబాద్ 24K₹1,56,600/10g-0.58%
వెండి₹2,20,983/kg+1.70%

సాంస్కృతికం

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ సంగీత విభావరి హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద

Staff Reporter22 September 2026, 4:01 PM9 చూసులుtrinetnews.com
అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’ సంగీత విభావరి

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

అక్కినేని 102వ జయంతి సందర్భంగా అలరించిన ‘పాడవోయి భారతీయుడా...’

కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఘనంగా సినీ సంగీత విభావరి

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్, నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు 102వ జయంతిని పురస్కరించుకుని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాడవోయి భారతీయుడా...’ అక్కినేని సినీ సంగీత విభావరి మంగళవారం ఘనంగా జరిగింది.

హైదరాబాద్ చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ, కళా సుబ్బారావు కళావేదికలో సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో అక్కినేని నటించిన చిత్రాల్లోని చిరస్మరణీయ గీతాలను ప్రముఖ గాయనీ గాయకులు ఆలపించి ప్రేక్షకులను అలరించారు. పాతతరం సినీ సంగీత మాధుర్యాన్ని గుర్తుచేసిన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

కార్యక్రమానికి పూర్వ జిల్లా న్యాయమూర్తి, భారత సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీ నేరెళ్ళ మల్లాది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినీ విజ్ఞాన విశారద శ్రీ యస్.వి. రామారావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని శ్రీ వై.ఎస్. రామకృష్ణ సమర్పించారు.

ఈ సందర్భంగా వక్తలు అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినీ రంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. నటనలో సహజత్వం, క్రమశిక్షణ, కళారంగంపై అంకితభావంతో ఆయన తరతరాలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అక్కినేని చిత్రాల్లోని సుప్రసిద్ధ గీతాలతో సాగిన సంగీత విభావరి ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా నిర్మాణాలు * స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌తో విమానాశ్ర‌యాల ప‌నులు చేప‌ట్టాలి... * శాఖ‌ల మ‌ధ్య స‌మన్వ‌యంతోనే ప‌నులు వేగ‌వంతం * ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్ 22:

మిగతా చదవండి →

ద్విచక్ర వాహనంపై సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

ద్విచక్ర వాహనంపై సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్,22.మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ లో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ సుడిగాలి పర్యటన చేశారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా డివిజన్ లోన

మిగతా చదవండి →

మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

MLA Gangula Kamalakar launched the poster for 'Koti 50: The Biggest Live Concert in Hyderabad', celebrating legendary music director Koti's 50-year milestone.

మిగతా చదవండి →