హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:
‘గాన మంజరి’ ఆధ్వర్యంలో ‘సినీ గీతాల సుమ సౌరభాలు’ తొలి సంచిక సంగీత కార్యక్రమం శనివారం నిర్వహించారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ కళా మారుతి వేదికలో సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరిగింది.వ్యవస్థాపకుడు పి. ఆనంద్, నిర్వాహకురాలు పి. విజయలక్ష్మి, సమన్వయకర్త జి. శ్యామలాదేవి ఆధ్వర్యంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. గాయనీగాయకులు జి. సాయిరాం, పి. ఆదిత్య, కె. గౌరి, ఎం. ఉష, వి. వరలక్ష్మి, ఎస్. పార్వతి, డి. స్నేహలత సినీ గీతాలను ఆలపించారు. ఎం. ఉష గానంతోపాటు కరోకే సహకారం అందించారు.






