హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 14:
శ్రీ భూపతి మ్యూజికల్స్ సమర్పణలో తెలుగు సినీ గీతాలు, శ్రీరామ భక్తితత్వ సార గీతాల సంగీత కార్యక్రమం శనివారం నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభ కళా లలిత కళావేదికలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరిగింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ భూపతి కృష్ణకుమార్ తెలుగు సినీ గీతాలను ఆలపించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు శ్రీ భూపతి నాగేంద్రరావు స్వయంగా రచించిన శ్రీరామ భక్తితత్వ సార గీతాలను తబలా లూప్స్‌పై ఆలపించారు.
సినీ సంగీతం, ఆధ్యాత్మిక గీతాల సమ్మేళనంగా కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని గానసభ టీవీ, ట్రైనెట్ లైవ్ టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.






