బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సినిమా

డ్యూ డేట్‌లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో విలక్షణ నటుడు సునీల్‌

nagendraశుక్రవారం, 16 అక్టోబర్ 2026 · 4:36 AM4 వీక్షణలుtrinetnews.com
డ్యూ డేట్‌లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో విలక్షణ నటుడు సునీల్‌

లోమేష్‌ పుడిపెద్ది హీరోగా, జయశ్రీ‌ హీరోయిన్‌గా, ప్రణీత పట్నాయక్, విజ్ఞానిలు ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం 'డ్యూ డేట్‌' వరిష్‌ స్టూడియోస్‌ పతాకంపై పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను నిర్మాతలుగా ఆనంద్‌.కె. దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవల ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో ఏకధాటిగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇటీవల కమెడియన్‌ కృష్ణభగవాన్‌ 'డ్యూ డేట్‌' షూటింగ్‌లో జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలం విరామం తరువాత కృష్ణ భగవాన్‌ ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంది. కాగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో నటుడు సునీల్‌ జాయిన్‌ అయ్యాడు. ఈ చిత్రంలో సునీల్‌ ఓ లాయర్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఆయన కెరీర్‌ల్‌ ఇదొక డిఫరెండ్‌ పాత్రగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రంలో నటుడు సునీల్‌ పవర్‌ఫుల్‌ లాయర్‌ శేఖర్‌ చంద్రగా కనిపించబోతున్నాడు. ఆయన పాత్ర సినిమా పెద్ద ఎస్సెట్‌గా ఉంటుంది. ప్రజెంట్‌ బర్నింగ్‌ ఇష్యూ ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్‌ రూమ్‌ డ్రామా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ప్రతి మనిషి, ప్రతి నెలా గుర్తుపెట్టుకునే డ్యూ డేట్‌ చుట్టు పూర్తి వాణిజ్య అంశాలతో అల్లుకున్న కథ ఇది. టైటిల్‌ దగ్గర నుంచి సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులకు కొత్తదనంతో పాటు పూర్తి సంతృప్తిని కలిగించే కథ, కథనాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించండతో పాటు అందర్ని ఆలోచింపజేస్తుంది. హృదయాలకు హత్తుకుంటుంది' అన్నారు.

లోమేష్‌ పుడిపెద్ది, జయశ్రీ‌, ప్రణీత పట్నాయక్, విజ్క్షాని, సునీల్‌ కృష్ణ భగవాన్,అక్షర గౌడ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్‌: జవ్వాడి నాయుడు, మాటలు: హరీష్‌ మీనన్‌, ఎడిటర్‌: సత్య గిడుటూరి, డీఓపీ: చెంచు జింక, నిర్మాతలు పవన్‌ తరిగోపుల, ఏలూరు శ్రీను, దర్శకత్వం: ఆనంద్‌.కె.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :