బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సినిమా

సత్యదేవ్, రమ్య కృష్ణ, ఫరియా అబ్దుల్లా, శరత్ మరార్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ 'ట్రయల్ అండ్ ఎర్రర్' పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

nagendraసోమవారం, 12 అక్టోబర్ 2026 · 2:18 AM2 వీక్షణలుtrinetnews.com
సత్యదేవ్, రమ్య కృష్ణ, ఫరియా అబ్దుల్లా, శరత్ మరార్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ 'ట్రయల్ అండ్ ఎర్రర్' పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

నిర్మాత శరత్ మరార్ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్‌ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కమల్ హాసన్ నటించిన స్టైలిష్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’కు దర్శకత్వం వహించిన రాజేష్ సెల్వ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.  

విభిన్నమైన పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకునే సత్యదేవ్.. ఈ సిరీస్‌ లో ఛాలెంజింగ్  క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథకు మరింత ఇంటెన్స్సిటీ తీసుకురానున్నారు. ఫరియా అబ్దుల్లా కూడా ఈ ప్రాజెక్ట్‌లో మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. ఈ సిరీస్‌లో విరాజ్ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్ పూరి, సంపత్ రాజ్, సుబ్బరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో, రాజేష్ సెల్వ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ట్రయల్ అండ్ ఎర్రర్’.. ప్రతిభావంతులైన నటీనటుల కలయికతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు సిద్ధమవుతోంది.

నటీనటులు: సత్యదేవ్, రమ్యకృష్ణ, ఫరియా అబ్దుల్లా, విరాజ్ అశ్విన్, చైతన్య కృష్ణ, వర్ష బొల్లమ్మ, యష్ పూరి, సంపత్ రాజ్, సుబ్బరాజు

సాంకేతిక బృందం:

నిర్మాత: శరత్ మరార్

బ్యానర్: నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్

రచన, దర్శకత్వం: రాజేష్ సెల్వ

పీఆర్వో: వంశీ-శేఖర్

 GSC00970.jpg.jpeg

 GSC00992.JPG.jpeg

Best regards,

PRO: Vamsi - Shekar

Contact: +91 9581799555  -  +91 9949994977

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :