బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,903+2.28%
NIFTY25,732+2.00%
22K₹1,12,812/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సినిమా

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" టీజర్ రిలీజ్

nagendraశుక్రవారం, 9 అక్టోబర్ 2026 · 2:20 AM10 వీక్షణలుtrinetnews.com
స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్ ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" టీజర్ రిలీజ్

ఈ నెల 22న ప్రీమియర్ కు వస్తున్న "నా వైఫ్ మిస్సింగ్" వెబ్ సిరీస్

ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్ ను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ "నా వైఫ్ మిస్సింగ్" ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది. "నా వైఫ్ మిస్సింగ్" సిరీస్ ను లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్ పై శివ కంఠంనేని నిర్మించారు. స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఈ రోజు స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ "నా వైఫ్ మిస్సింగ్" టీజర్ రిలీజ్ చేసి, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ అందించారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ - "నా వైఫ్ మిస్సింగ్" టీజర్ చాలా బాగుంది. ఈ టీమ్ అంతా నాకు బాగా తెలిసినవాళ్లు. ఆహాలో ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. "నా వైఫ్ మిస్సింగ్" కొత్త డైరెక్టర్ స్వాతికి మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

"నా వైఫ్ మిస్సింగ్" టీజర్ ఎలా ఉందో చూస్తే - పెద్దలు కుదిర్చిన సంబంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు వరుణ్, శ్వేతా. వారి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతూ ఉంటుంది. కానీ టీజర్ లో పెళ్లిచూపుల సమయంలోనే తను వర్జిన్ కాదు అని హీరోయిన్ చెప్పడంతో హీరో షాక్ కు గురైనట్లు చూపించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో తన వైఫ్ మిస్ అయినట్లు వరుణ్ కంప్లైంట్ ఇవ్వడం క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. పెళ్లి చూపుల సమయంలో శ్వేత చెప్పింది నిజమేనా, ఆమె మిస్సింగ్ కు కారణాలు ఏంటి, వరుణ్ పోలీసుల సహాయంతో తన భార్య ఎక్కడుందో తెలుసుకోగలిగాడా అనే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.

నటీనటులు - వరుణ్ సందేశ్, శ్వేతా బసుప్రసాద్, ప్రవీణ్, సత్య శ్రీ, తదితరులు

టెక్నీషియన్స్

---------------------

ఎడిటర్ - సాయిబాబు తలారి

డీవోపీ - ఎన్.ఎస్. సతీష్ కుమార్

మ్యూజిక్ - సాయి కార్తీక్

స్టోరీ - ఉమర్జీ అనురాధ

క్రియేటెడ్ బై - శ్రీనివాస్ మండల

బ్యానర్ - లైట్ హౌస్ సినీ మ్యాజిక్

ప్రొడ్యూసర్ - శివ కంఠంనేని

డైరెక్టర్ - స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ

పీఆర్ఓ - సురేష్ (ఎస్ కే మీడియా)

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :