ప్రధాన సంపాదకులు: రాపోలు వెంకటేశ్వర్లు

ఎడిషన్ మార్చండి

సోమవారం21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్సూర్యోదయం 6:04 amసూర్యాస్తమయం 6:13 pm

సోమవారం

21 సెప్టెంబర్ 2026

హైదరాబాద్

సూర్యోదయం 6:04 am

సూర్యాస్తమయం 6:13 pm

SENSEX74,859+1.16%
NIFTY23,414+1.28%
హైదరాబాద్ 22K₹1,44,812/10g+0.34%
హైదరాబాద్ 24K₹1,57,977/10g+0.34%
వెండి₹2,23,150/kg+4.34%

సినిమా

ఘనంగా 'పిఠాపురంలో అలా మొదలైంది' చిత్ర సక్సెస్ మీట్

ఘనంగా "పిఠాపురంలో అలా మొదలైంది" చిత్ర సక్సెస్ మీట్ - థియేటర్లు పెరగడం ఆనందాన్ని ఇస్తుందంటున్న నటుడు పృథ్విరాజ్* డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్

Staff Reporter21 September 2026, 11:40 AM2 చూసులుtrinetnews.com
ఘనంగా 'పిఠాపురంలో అలా మొదలైంది' చిత్ర సక్సెస్ మీట్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

*ఘనంగా "పిఠాపురంలో అలా మొదలైంది" చిత్ర సక్సెస్ మీట్ - థియేటర్లు పెరగడం ఆనందాన్ని ఇస్తుందంటున్న నటుడు పృథ్విరాజ్*

డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయగా ఈ చిత్రానికి వచ్చిన అనూహ్యస్పందన పై చిత్ర బృందం తమ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా *పృథ్వి రాజ్ మాట్లాడుతూ...*

"తల్లిదండ్రులు పిల్లల క్షేమం కోసం చెప్పే విషయాలు వినకపోతే పిల్లల జీవితాలు ఎలా తారుమారవుతాయో చెబుతూ వచ్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఆదరించడం చాలా సంతోషంగా ఉంది. నేను మొదటిసారి నటించిన సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ గారు. పైన చిన్న నిర్మాతల పాలిట దేవుడు. సమాజంలో సాధారణంగా చూస్తుంది కొన్ని యదార్థ సంఘటనలను ఈ సినిమా ప్రతిబింబిస్తుంది. ఎవరైనా ఒక ఆర్టిస్ట్ బాగా నటిస్తే వారి ప్రతిభను గుర్తించే గొప్ప వ్యక్తులు అంతా ఈ సినిమాలో ఉన్నారు. తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పేరిట వచ్చిన ఈ సినిమా ఆయనకు తగ్గట్లు ఎక్కడ తగ్గకుండా ఉంటుంది. ఆయన సినిమాను గుర్తిస్తారని అనుకుంటున్నాను. ప్రేక్షకులు అంతా సినిమాను మరింత ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాము" అన్నారు.

*నటుడు జబర్దస్త్ శేషు మాట్లాడుతూ...*

"పిఠాపురంలో అలా మొదలైంది అనే సినిమా ప్రతి ఊరిలో జరిగే కథ. ఈ సినిమా కుటుంబంలో అందరూ చూడాలి. సినిమా ఇప్పటికే మంచి ఆదరణ పొందుతుంది. పిల్లల్ని ఎలా పెంచాలో చెప్పే సినిమా. సినిమాలో కొన్ని సన్నివేశాలు మనసులు కదిలిస్తాయి" అన్నారు.

*నటుడు జేడివి ప్రసాద్ మాట్లాడుతూ...*

"ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా కుటుంబంతో కలిసి చూడాల్సింది. అందరూ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను" అన్నారు.

*నటి మణిచందన మాట్లాడుతూ...*

"చిత్ర బృందం అందరికీ నా అభినందనలు. గతంలో ఎన్ని సినిమాలలో నటించినా కూడా ఈ సినిమాలో నా పాత్ర చాలా బావుంటుంది. ముగ్గురు హీరో హీరోయిన్స్ బాగా చేశారు. నా పాత్ర ఒక మంచి గృహిణిగా ఉంటుంది. పిల్లలు ఇకపై తమ తల్లితండ్రులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లలకంటే పెద్ద వారికి ఏది ఎక్కువ కాదు" అన్నారు.

*నటుడు విరాట్ మాట్లాడుతూ...*

"నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. సినిమాలో నాకు మంచి పాత్రను ఇచ్చారు. నాతో నటించిన నటీనటులు మంచి సపోర్ట్ చేశారు. ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించారు. థియేటర్స్ మరిన్ని పెంచాలని కోరుకుంటున్నాను" అన్నారు.

*నటుడు సన్నీ అఖిల్ మాట్లాడుతూ...*

"నేను కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాలో మంచి గుర్తుండిపోయే చిత్రం. సినిమా నాకు మంచి గుర్తింపు ఇచ్చింది. సినిమాను అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.

*నటి స్రీలు మాట్లాడుతూ...*

"నా పాత్ర తండ్రి చాలా స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల కూతురు జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడవచ్చు. సీనియర్ నటీనటులతో కలిసి పని చేయడం చాలా గర్వంగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. థియేటర్స్ కూడా పెంచడం చాలా సంతోషం అనిపిస్తుంది. తల్లితండ్రుల మధ్య సంబంధం ఎలా ఉంటే వారి జీవితాలు ఎలా ఉంటాయో చెప్పే సినిమా" అన్నారు.

*నటి ప్రత్యూష మాట్లాడుతూ...*

"ఈ సినిమా దాదాపుగా అంత పిఠాపురంలోలే షూట్ చేసాము. నేను రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి నటించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో మాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల బాగా చేసాము. ఈ సినిమా తల్లితండ్రులతో కలిసి పిల్లలు చూడాల్సిన సినిమా. సినిమా అందరూ చూసి ఆదరించవలసిందిగా కోరుకుంటునాన్ను" అన్నారు.

*నిర్మాత బాల కృష్ణ మాట్లాడుతూ...*

"ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మీడియా వారికి థాంక్స్. ప్రస్తుతం మా సినిమాకి థియేటర్లు కూడా పెరుగుతున్నాయి. చాలా కష్టపడి ఈ సినిమా పూర్తిచేశాము. ప్రేక్షకులు ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతున్న సినిమా ఇది. చంద్ర మహేష్ గారితో నాకు ఇంతకాలం నుండి సన్నిహిత సంబంధం ఉంది. ఈ సినిమాను మరింత సపోర్ట్ చేయాలి. ఇటువంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. థియేటర్ కు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు పిల్లలు కచ్చితంగా చూడవలసిన సినిమా" అన్నారు.

*దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ...*

"మా సినిమాను సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థాంక్స్. ఈ సినిమా పూర్తి కావడానికి ముఖ్య కారణం మన నిర్మాతలు. సినిమా విడుదలైనప్పటి నుండి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. కలెక్షన్స్ కూడా పిఠాపురం ప్రాంతం నుండి బాగా వస్తున్నాయి. ఈ సినిమా చూసిన ఒక వ్యక్తి తన జీవితానికి కనెక్ట్ అయిందని చాలా ఎమోషనల్ గా నాతో అన్నారు. ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వ పడుతున్నాను. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులు వారు తప్ప ఇంకెవరు అలా చేయలేరు అనేలా నటించారు. చిత్ర బృందం అందరికీ థాంక్స్. కుటుంబ సమేతంగా ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.

ఇవి కూడా చదవండి

సర్దార్ పటేల్ కళాశాలలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ శ్రమదానం

సర్దార్ పటేల్ కళాశాలలో ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ శ్రమదానం

ఎన్‌సీసీ క్యాడెట్లు మరియు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల శ్రమదానం సర్దార్ పటేల్ కళాశాల పద్మారావ్‌నగర్, సికింద్రాబాద్ హైద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, సెప్టెంబర్,21.సర్దార్ పటేల్ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు మరియు ఎన్‌ఎస్‌ఎస్ వ

మిగతా చదవండి →

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

గన్‌పార్క్‌ వద్ద బీసీ సంఘాల నిరసన.. కులగణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ పెట్టాలని డిమాండ్

జనగణలో కునగనన కావాలి, ఓబీసీలకు ప్రత్యేక కాలం చేపట్టలని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే ఓబీసీలకు కులాల వారీగా జన గనన చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బిసి పొలిటికల్ ప్రింట్ సంయుక్త ఆధ్వర్యంలో గన్ పార్క్ లోని అమరవీర

మిగతా చదవండి →

‘చాయ్ విత్ సైనా’ వేదికగా సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్‌పై విస్తృత అవగాహన

‘చాయ్ విత్ సైనా’ వేదికగా సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్‌పై విస్తృత అవగాహన

తెలుగు ప్రెస్ రిలీజ్ ‘చాయ్ విత్ సైనా’ ద్వారా సస్టైనబుల్ మెన్స్ట్రువల్ హైజీన్‌పై అవగాహనకు ప్రముఖులు, వైద్యులు, మార్పు తీసుకువచ్చే నాయకుల సమిష్టి మద్దతు హైదరాబాద్, సెప్టెంబర్ 20, 2026: సుహార్థ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “Chai wi

మిగతా చదవండి →

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి

పట్టణ పేదల సొంతింటి కలకు తొలి అడుగు* *ఇందిరమ్మ ఇండ్ల టవర్స్‌కు శంకుస్థాపన* *రాయదుర్గం మల్కం చెరువు సమీపంలో నిర్మాణ పనులకు శ్రీకారం* *పేదవాడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం* *పైరవీలకు తావులేకుండా పారదర్శకంగా లబ్ధిదారు

మిగతా చదవండి →