Thursday8 October 2026హైదరాబాద్

SENSEX71,708-0.93%
NIFTY22,241-1.39%
HYD 22K₹1,37,956/10g-0.12%
भाषाएँ

Cinema

फिल्म 'आई हेट मैरिज' का गाना 'अप्पुडे पेल्ला' रिलीज

'ఐ హేట్‌ మ్యారేజ్‌' చిత్రం నుంచి అప్పుడే పెళ్లా? లిరికల్‌ సాంగ్‌ విడుదల సుగి విజయ్‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌ హీరో హీరోయిన్లుగా పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఐ హేట్‌ మ్యారేజ్‌',

Staff Reporter21 September 2026, 11:27 AM38 व्यूtrinetnews.com
फिल्म 'आई हेट मैरिज' का गाना 'अप्पुडे पेल्ला' रिलीज

Share this story

Share link keeps your language (?lang=)

'ఐ హేట్‌ మ్యారేజ్‌' చిత్రం నుంచి అప్పుడే పెళ్లా? లిరికల్‌ సాంగ్‌ విడుదల

సుగి విజయ్‌, జుప్సీ భద్ర, హారిక రాజేందర్‌ హీరో హీరోయిన్లుగా పరమేష్‌ రేణుకుంట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఐ హేట్‌ మ్యారేజ్‌', ఆర్య సినిమా పతాకపంపై దయానంద్‌ మాదం, కార్తీక్‌ వెంపటి నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ చివరి వారంలో విడుదల కానుంది. కాగా సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఈ చిత్రంలోని అప్పుడే పెళ్లా అనే లిరికల్‌ వీడియోను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ విడుదల చేశారు. వరికుప్పల యాదగిరి రచించి, స్వరాలు సమాకూర్చిన ఈ పాటను సాహితి చాగంటి ఆలపించారు. ఈ సందర్భంగా బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఈ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా రూపొందిన విధానం నన్ను అలరించింది. తమ స్నేహితుడిని దర్శకుడిని చేయడం కోసం చిన్నప్పటి ఫ్రెండ్స్‌ అంతా కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్‌ చేశారు. కంటెంట్‌తో పాటు ఎమోషన్‌ ఉన్న సినిమా ఇది. ఈ బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీలో యూత్‌కు మంచి సందేశం కూడా ఉంది. తప్పకుండా ఈ సినిమా థియేటర్లో సౌండ్‌ చేస్తుంది' అన్నారు. దర్శకుడు పరమేష్‌ రేణుకుంట్ల మాట్లాడుతూ '' ఎంతో స్ట్రగుల్స్‌ మధ్య ఈ సినిమాను నిర్మించాను. నా కోసం నా స్నేహితులు ఈ సినిమా నిర్మించారు. జెన్‌ జీ బ్యాచ్‌కు కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్‌తో తమను తాము స్క్రీన్‌ మీద చూసుకున్న ఫీలింగ్‌ కలుగుతుంది. ఈ సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన కొంత మంది యూత్‌కు ఎంతో క్రేజీగా నచ్చింది అంటూంటే సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది' అన్నారు. హీరోయిన్‌ జుప్పీ భద్ర మాట్లాడుతూ '' ఈ రోజు నేను ఇక్కడికి పెళ్లి కూతురు గెటప్‌లో ఎందుకు వచ్చానో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అందరికి కనెక్ట్‌ అయ్యే సినిమా ఇది. తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసం వుంది' అన్నారు. ఈ సమావేశంలో సంగీత దర్శకుడు వరికుప్పల యాదగిరి, చిత్ర నిర్మాతలు దయానంద్‌, కార్తీక్‌, రచయిత ఘటిక చలం, ఎడిటర్‌ ఆవుల వెంకటేష్‌, అడ్వకేట్‌ వీణ, కో ప్రొడ్యూసర్‌ కాశీ తదితరులు పాల్గొన్నారు. సుగి విజయ్‌, జుప్పీ భద్ర, హారిక రాజేందర్‌, సాహితి కృష్ణ, పృథ్వీరాజ్‌, రవివర్మ అద్దూరి, ఆశ్రిత వేముగంటి, ప్రభావతి, జాకీర్‌, శ్రీదేవి ఆరోజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ఫ్లే, డైలాగ్స్‌, డైరెక్షన్‌ పరమేష్‌ రేణుకుంట్ల, ఫోటోగ్రఫీ: విజయ్‌.సి.కుమార్‌, సంగీతం: వరికుప్పల యాదగిరి, ఎడిటిర్‌,ఆవుల వెంకటేష్‌, బ్యానర్‌ ఆర్య సినిమా, ప్రొడ్యూసర్స్‌, దయానంద్ మాదం, కార్తీక్‌ వెంపటి.

यह भी पढ़ें

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी

सेंट्रल जिला भाजपा महिला मोर्चा कार्यकारिणी सदस्य के रूप में भाग्यलक्ष्मी.... - पार्टी को मजबूत करने के लिए काम करूंगी: सीएच भाग्यलक्ष्मी.... ट्राइनेट न्यूज, हैदराबाद 07 अक्टूबर: भाजपा सेंट्रल जिला महिला मोर्चा

और पढ़ें →

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

गायिका पी. सुशीला के ट्रस्ट को 50 लाख रुपये की आर्थिक सहायता की घोषणा तेलंगाना सरकार ने की

सुशीला द्वारा स्थापित कलाकारों के कल्याणकारी ट्रस्ट को आर्थिक सहायता। हैदराबाद, चिक्कडपल्ली, ट्राइनेट न्यूज, 6 अक्टूबर: प्रख्यात गायिका पी. सुशीला द्वारा कलाकारों के कल्याण के लिए स्थापित ट्रस्ट को तेलंगाना सरकार ने पचास लाख रुपये की वित्तीय सहायता...

और पढ़ें →

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर

दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए: गोली प्रभाकर। नलगोंडा, 6 अक्टूबर, ट्रिनेट न्यूज: कांग्रेस सरकार द्वारा दिव्यांगों को दिए गए वादों को तुरंत लागू किया जाना चाहिए, यह मांग भाजपा दिव्यांग प्रकोष्ठ के राज्य सह-संयोजक गोली प्रभाकर ने की।

और पढ़ें →

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

परिवार के सदस्यों की उपस्थिति में डॉक्टर तेन्नेटी सुधा देवी की 75वीं जयंती मनाई गई

राज्य उपभोक्ता विवाद निवारण आयोग की चेयरपर्सन जस्टिस राधा रानी ने कहा कि परिवार के सभी सदस्यों का अंत तक एक साथ रहना बड़े माता-पिता को एक महान अनुभूति देता है।

और पढ़ें →