బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

సినిమా

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో

Sai Rapoluసోమవారం, 23 నవంబర్ 2026 · 1:25 PM23 వీక్షణలుtrinetnews.com
‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

*‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్‌ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు*

పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో G.V.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలో, సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘స్నేహం కోసమే అన్నీ.. స్నేహంతోనే అన్నీ.. ఆశ, మోహం, అసూయ, స్వార్థం అన్నీ చచ్చి.. నీలోని మనిషి.. ప్రతీ మనిషిని ప్రేమిస్తే చాలు.. ప్రతీ ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు.. ఆ ప్రేమలో ప్రతీ క్షణం ఆనందంగా జీవిస్తావు.. నువ్వు తృప్తిగా మరణించడానికి మార్గం మానవత్వం.. అదే దైవం, అదే మోక్షం’, ‘ప్రాణ స్నేహితులు చచ్చిపోతే.. వాడితో పాటు చచ్చిపోయే స్నేహితుడు చరిత్రలో ఉన్నాడా?’, ‘అద్భుతాలను అనుభవించాలి.. ప్రశ్నించకూడదు.. సమాధానం దొరకదు.. ఉండదు’.. అనే అద్భుతమైన డైలాగ్స్, గుండెని తాకే ఎమోషన్స్‌తో, మనసుని కదిలించే సన్నివేశాలతో ట్రైలర్ అందరిలోనూ ‘ఆలోచన’ను రేకెత్తించేలా సాగింది. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం..

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘మంచు పల్లకి’ స్పూర్తితో ‘ఆలోచన’ చేశామని అన్నారు. ఈ ‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన. వృద్దాప్యంలోనూ తల్లిదండ్రులు తమ బిడ్డల గురించే ఆలోచిస్తుంటారు. కానీ బిడ్డలకు మాత్రం వేరే వేరే ప్రపంచాలుంటాయి. వృద్దాప్యంలో తమ తమ స్నేహితులతో కలిసి ఉండటం, ఆలోచనలు పంచుకోవడం, సమయాన్ని గడపడంతో మళ్లీ ఏజ్ రివర్స్ అయినట్టుగా వారికి అనిపిస్తుంది. అలాంటి ఆలోచనను రేకెత్తించేలా ఈ ‘ఆలోచన’ ఉంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలానే ఈ సినిమాని ఆదరించాలని, ‘ఆలోచన’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నటీనటులు : G.V నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ తదితరులు

టెక్నికల్ టీం

బ్యానర్ :పీఎస్‌జే ఫిల్మ్స్ కంపెనీ

నిర్మాత : ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన

దర్శకుడు : సురేందర్ చాచా

కెమెరామెన్ : టి. సురేంద్ర రెడ్డి

సంగీత దర్శకుడు : వియాన్

ఎడిటర్ : ఆర్.ఎల్. వర్మ

ఆర్ట్ డైరెక్టర్ : గిరీష్ దేవాంగ్

రిలీజ్ : ఎస్. కె. పిక్చర్స్

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →