'ఆలోచన' చిత్రం నిజంగానే మంచి ఆలోచన.. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు. పీఎస్జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం 'ఆలోచన'. ఈ మూవీలో జి.వి. నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రల్లో, సుజనా, అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ, ప్రసాద్ రామ్, నరేంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 27న 'ఆలోచన' మూవీని గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు.
'స్నేహం కోసమే అన్నీ.. స్నేహంతోనే అన్నీ.. ఆశ, మోహం, అసూయ, స్వార్థం అన్నీ చచ్చి.. నీలోని మనిషి.. ప్రతి మనిషిని ప్రేమిస్తే చాలు.. ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు.. ఆ ప్రేమలో ప్రతి క్షణం ఆనందంగా జీవిస్తావు.. నువ్వు తృప్తిగా మరణించడానికి మార్గం మానవత్వం.. అదే దైవం, అదే మోక్షం', 'ప్రాణ స్నేహితులు చచ్చిపోతే.. వాడితో పాటు చచ్చిపోయే స్నేహితుడు చరిత్రలో ఉన్నాడా?', 'అద్భుతాలను అనుభవించాలి.. ప్రశ్నించకూడదు.. సమాధానం దొరకదు.. ఉండదు'.. అనే అద్భుతమైన డైలాగ్స్, గుండెని తాకే ఎమోషన్స్తో, మనసుని కదిలించే సన్నివేశాలతో ట్రైలర్ అందరిలోనూ 'ఆలోచన'ను రేకెత్తించేలా సాగింది.
ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "'మంచు పల్లకి' స్ఫూర్తితో 'ఆలోచన' చేశామని అన్నారు. ఈ 'ఆలోచన' చిత్రం నిజంగానే మంచి ఆలోచన. వృద్ధాప్యంలోనూ తల్లిదండ్రులు తమ బిడ్డల గురించే ఆలోచిస్తుంటారు. కానీ బిడ్డలకు మాత్రం వేరే వేరే ప్రపంచాలుంటాయి. వృద్ధాప్యంలో తమ తమ స్నేహితులతో కలిసి ఉండటం, ఆలోచనలు పంచుకోవడం, సమయాన్ని గడపడంతో మళ్లీ ఏజ్ రివర్స్ అయినట్టుగా వారికి అనిపిస్తుంది. అలాంటి ఆలోచనను రేకెత్తించేలా ఈ 'ఆలోచన' ఉంది. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అలానే ఈ సినిమాని ఆదరించాలని, 'ఆలోచన' చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
నటీనటులు: జి.వి. నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ తదితరులు.
టెక్నికల్ టీం:
బ్యానర్: పీఎస్జే ఫిల్మ్స్ కంపెనీ
నిర్ಮಾతలు: ప్రదీప్ కుమార్, శ్రీనివాస్ గుండబోయిన
దర్శకుడు: సురేందర్ చాచా
కెమెరామెన్: టి. సురేంద్ర రెడ్డి
సంగీత దర్శకుడు: వియాన్
ఎడిటర్: ఆర్.ఎల్. వర్మ
ఆర్ట్ డైరెక్టర్: గిరీష్ దేవాంగ్
రిలీజ్: ఎస్.కె. పిక్చర్స్







