బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

వ్యాపారం

ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.. ఓపీఎస్‌ అమలుతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి..

ఉద్యోగుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య.. సికింద్రాబాద్, నవంబర్‌ 17, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్‌ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. గత రెండు నెలలుగా వివ

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:09 AM13 వీక్షణలుtrinetnews.com
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి.. ఓపీఎస్‌ అమలుతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి..

ఉద్యోగుల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుంది: ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య..

  • సికింద్రాబాద్, నవంబర్‌ 17,

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్‌ టీచింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళన మరింత ఉధృతమైంది. గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో నిరసనలు చేపడుతున్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఓయూ పరిపాలనా భవనం ప్రధాన గేటు ఎదుట ప్రత్యేకంగా టెంట్‌ ఏర్పాటు చేసి ఉద్యోగులు దీక్షలో కూర్చున్నారు. తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఈ దీక్షల్లో డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఉపేందర్‌ తో పాటు ఎన్జీవో సంఘం నుంచి మల్లేష్‌, టెక్నికల్‌ స్టాఫ్‌ అసోసియేషన్‌ నుంచి మల్లేష్‌, బిక్షపతి, మహేష్‌, బీఈడీ కళాశాల నుంచి మహేశ్వరి, అడ్మినిస్ట్రేషన్‌ భవనం నుంచి మెహర్‌, వినోద్‌, షేక్‌ ఫారుక్‌, ఎగ్జామినేషన్‌ బ్రాంచ్‌ నుంచి యరాల రాజేష్‌, పి. సురేష్‌, కె. శ్రీకాంత్‌, గెస్ట్‌ హౌస్‌ నుంచి శ్రీనివాస్‌ యాదవ్‌, టైమ్‌ స్కేల్‌ ఉద్యోగుల తరఫున శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులకు రాజకీయ, విద్యార్థి సంఘాల మద్దతు..

రిలే నిరాహార దీక్షలకు బీజేపీ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య సంఘీభావం ప్రకటించారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏళ్ల తరబడి విశ్వవిద్యాలయానికి సేవలందిస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు యూనివర్సిటీ యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు. ఉద్యోగుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారి సమస్యలను పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే ఉద్యోగుల పక్షాన పార్టీ తరఫున కూడా పోరాటం చేస్తామని తెలిపారు.

అదేవిధంగా విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థుల సంఘాల ప్రతినిధులు సైతం దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. విశ్వవిద్యాలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నాన్‌ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం అత్యవసరమని పేర్కొన్నారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఓపీఎస్‌, క్రమబద్ధీకరణే ప్రధాన డిమాండ్లు..

2001 నుంచి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) అమలు చేయాలని, 2004 సెప్టెంబర్‌ 1 తర్వాత నియమితులైన వారికి సీపీఎస్‌ అమలు చేయాలని ఉద్యోగ జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అర్హులైన వారికి అంతర్గత పదోన్నతులు కల్పించాలని కోరుతోంది. అలాగే విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్‌ బకాయిలను చెల్లించాలని, ఉద్యోగుల వైద్య ఖర్చులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఉద్యోగుల పెన్షన్‌ భద్రత, ఉద్యోగ క్రమబద్ధీకరణ, పదోన్నతులు, ఖాళీల భర్తీ, ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల విషయంలో జరుగుతున్న జాప్యంపై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకునే వరకు విడతలవారీగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని ఉద్యోగ జేఏసీ నాయకులు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →