Friday23 October 2026హైదరాబాద్

SENSEX73,124-2.15%
NIFTY22,600-2.36%
HYD 22K₹1,30,690/10g-3.62%
भाषाएँ

Business

बैंकिंग में स्वदेशी क्वांटम तकनीकों को बढ़ावा: सी-डैक और बैंक ऑफ इंडिया के बीच समझौता

बैंकिंग में स्वदेशी क्वांटम तकनीकों को बढ़ावा, सी-डैक और बैंक ऑफ इंडिया के बीच समझौता। सुरक्षा, वित्तीय विश्लेषण और कर्मचारियों के कौशल विकास पर विशेष ध्यान। ट्राइनेट न्यूज, नई दिल्ली, 23 अक्टूबर: बैंकिंग क्षेत्र

Staff Reporter23 October 2026, 2:39 PM3 व्यूtrinetnews.com
बैंकिंग में स्वदेशी क्वांटम तकनीकों को बढ़ावा: सी-डैक और बैंक ऑफ इंडिया के बीच समझौता

Share this story

Share link keeps your language (?lang=)

బ్యాంకింగ్‌లో స్వదేశీ క్వాంటం సాంకేతికతలకు ఊతం

సీ–డాక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం

భద్రత, ఆర్థిక విశ్లేషణ, సిబ్బంది నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ట్రైనెట్ న్యూస్, న్యూఢిల్లీ, అక్టోబర్ 23: బ్యాంకింగ్ రంగంలో స్వదేశీ క్వాంటం సాంకేతికతలు, ఆధునిక డిజిటల్ పరిష్కారాల వినియోగానికి సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ–డాక్), బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులు కలిపాయి. సంయుక్త పరిశోధనలు, ప్రయోగాత్మక అమలు, సాంకేతిక ప్రదర్శనలు, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా అక్టోబర్ 22న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తి శాస్త్రీయ సంస్థ సీ–డాక్‌కు అధిక సామర్థ్య కంప్యూటింగ్, కృత్రిమ మేధ, క్వాంటం సాంకేతికతలు, బ్లాక్‌చెయిన్, సైబర్ భద్రత రంగాల్లో ఉన్న పరిజ్ఞానాన్ని ఈ భాగస్వామ్యంలో వినియోగించనున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్న బ్యాంకింగ్ అనుభవం, దేశవ్యాప్త కార్యకలాపాలు, భారీ స్థాయి సాంకేతిక వ్యవస్థలతో దీనిని అనుసంధానించనున్నారు. ఆర్థిక రంగంలో ఆవిష్కరణలకు తోడ్పడే క్వాంటం సాంకేతిక వాతావరణాన్ని అభివృద్ధి చేయడం ఈ ఒప్పందంలో ప్రధాన అంశం. క్వాంటం సాంకేతికతలతో అందుబాటులోకి వచ్చే అవకాశాలతోపాటు ఎదురయ్యే భద్రతా సవాళ్లకు బ్యాంకింగ్ వ్యవస్థలను సిద్ధం చేయనున్నారు. భద్రత, విశ్వసనీయత, ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం, నిర్ణయ ప్రక్రియలను మెరుగుపరిచేందుకు క్వాంటం ప్రేరిత, క్వాంటం దాడులను తట్టుకునే సాంకేతికతలను సంయుక్తంగా పరిశీలించనున్నారు. బ్యాంకింగ్‌లో ప్రాధాన్య అవసరాలను గుర్తించి, నియంత్రిత సురక్షిత ప్రయోగ వాతావరణంలో నమూనా పరిష్కారాలను పరీక్షించనున్నారు. వాటి సాంకేతిక సాధ్యత, బ్యాంకింగ్‌కు కలిగే ప్రయోజనాలను అంచనా వేసి, ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యవస్థలతో పనితీరును పోల్చనున్నారు. ఫలితాల ఆధారంగా తదుపరి అభివృద్ధి, ప్రయోగాత్మక అమలు, వినియోగానికి కార్యాచరణ రూపొందించనున్నారు. పెరుగుతున్న సైబర్ భద్రతా ఆందోళనలు, కొత్త సాంకేతిక ముప్పుల నేపథ్యంలో క్వాంటం సవాళ్లను తట్టుకునే ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ పేర్కొన్నారు. స్వదేశీ ఆవిష్కరణల కోసం సీ–డాక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న బ్యాంక్ ఆఫ్ ఇండియాను అభినందించారు. దేశీయ క్వాంటం, ఆధునిక సాంకేతిక సామర్థ్యాలను ఆచరణాత్మక బ్యాంకింగ్ పరిష్కారాలుగా మలచడంలో ఈ ఒప్పందం కీలక అడుగని సీ–డాక్ డైరెక్టర్ జనరల్ ఇ. మగేష్ తెలిపారు. సంయుక్త పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధి ద్వారా సురక్షితమైన, భవిష్యత్ అవసరాలకు సిద్ధమైన ఆర్థిక వ్యవస్థకు తోడ్పడతామని పేర్కొన్నారు. సైబర్ భద్రత నుంచి సంక్లిష్ట ఆర్థిక నిర్ణయాల వరకు బ్యాంకింగ్‌లోని అనేక అంశాలను క్వాంటం సాంకేతికతలు ప్రభావితం చేయగలవని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. ఈ అవకాశాలను క్రమబద్ధంగా పరిశీలిస్తూ, తదుపరి తరం సాంకేతికతలకు అవసరమైన పరిజ్ఞానం, సామర్థ్యాలను పెంపొందించుకుంటామని వివరించారు. క్వాంటం సాంకేతికతలతోపాటు కృత్రిమ మేధ, బ్లాక్‌చెయిన్ తదితర రంగాల్లోనూ సహకారానికి ఒప్పందం అవకాశం కల్పిస్తోంది. పత్రాల సమాచారాన్ని స్వయంచాలకంగా విశ్లేషించడం, ఖాతాదారులు–ఉద్యోగులకు సాంకేతిక సహాయం, మోసాల విశ్లేషణ, రుణ–ఆర్థిక విశ్లేషణలు, సురక్షిత ఏఐ వేదికలు, బాధ్యతాయుత ఏఐ వినియోగం, స్మార్ట్ కాంట్రాక్టులు, డిజిటల్ గుర్తింపు, సురక్షిత సమాచార మార్పిడి వంటి అంశాలను పరిశీలించనున్నారు. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం భద్రత, ఏఐ, బ్లాక్‌చెయిన్ రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు.

సీ–డాక్ ముంబై ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్ సిన్హా, బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజీఎం–ఐటీ, సీఐఓ సత్యేంద్ర సింగ్ ఒప్పంద పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్. కృష్ణన్, రాజీవ్ మిశ్రా, మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుదీప్ శ్రీవాస్తవ, ఇ. మగేష్‌తోపాటు ఆయా సంస్థల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

यह भी पढ़ें

पసరకొండ किशोर ने केटीआर से की मुलाकात... एमएलसी चुनावों पर दिए निर्देश

पసరకొండ किशोर ने केटीआर से की मुलाकात... एमएलसी चुनावों पर दिए निर्देश

केटीआर को बधाई दी पసరకొండ किशोर ने... - स्नातक चुनावों में जीत ही लक्ष्य के साथ काम करूंगा : किशोर ट्राइनेट न्यूज़, अंबरपेट अक्टूबर 23 : बीआरएस वर्किंग प्रेसिडेंट कलवाकुंतल तारकरामाराव से अंबरपेट ए...

और पढ़ें →

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్

మల్లికార్జున నగర్ ట్రెజరర్‌గా ఉడుత శ్రీకాంత్ నామినేషన్ - ఆశీర్వదించండి కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తా : ఉడుత శ్రీకాంత్ ట్రైనెట్ న్యూస్, అంబర్‌పేట్ అక్టోబర్ 22 : బాగ్ అంబర్‌పేట్ మల్లికార్జుననగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్ని

और पढ़ें →

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం

జేపల్లి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు ప్రదానం... వెల్జాల వెంకటేష్, గొడ్డేటి శేఖర్, కొర్రావత్ కవిత పవన్ నాయక్ ఆధ్వర్యంలో టోర్నమెంట్. ట్రైనెట్ న్యూస్, నాగర్ కర్నూలు అక్టోబర్ 22:

और पढ़ें →