బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

వ్యాపారం

యాదాద్రిలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తికి కార్యాచరణ 4,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా టీజీజెన్కో సన్నద్ధం

డిసెంబర్‌లో ఐదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి.. బొగ్గు సరఫరా వ్యవస్థ బలోపేతానికి చర్యలు హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రానున్న రబీ సీజన్ నాటికి పూర్తిస్థాయిలో 4,000 మెగావాట్ల విద్యుదుత్ప

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 5:56 AM10 వీక్షణలుtrinetnews.com
యాదాద్రిలో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తికి కార్యాచరణ 4,000 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా టీజీజెన్కో సన్నద్ధం

డిసెంబర్‌లో ఐదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి.. బొగ్గు సరఫరా వ్యవస్థ బలోపేతానికి చర్యలు

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో రానున్న రబీ సీజన్ నాటికి పూర్తిస్థాయిలో 4,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధించేందుకు టీజీజెన్కో కార్యాచరణ చేపట్టింది. ఒక్కొక్కటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు యూనిట్లలో నాలుగు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తి చేస్తున్నాయి. అక్టోబర్ 20న గ్రిడ్‌కు అనుసంధానమైన ఐదో యూనిట్‌లో డిసెంబర్‌లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బొగ్గు నిర్వహణ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని భెల్–టీజీజెన్కో ఉన్నతస్థాయి బృందం ప్లాంట్‌ను పరిశీలించింది. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట లక్ష్యాలతో ప్రణాళిక రూపొందించింది. నాలుగు బొగ్గు సరఫరా మార్గాలను పునరుద్ధరించి, ఒక్కో మార్గంలో గంటకు సగటున 800 టన్నుల చొప్పున మొత్తం 3,200 టన్నుల బొగ్గు తరలించే స్థాయికి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

బొగ్గు సరఫరాకు బహుముఖ ఏర్పాట్లు

ప్లాంట్‌కు నిరంతరాయంగా బొగ్గు అందించేందుకు సింగరేణికి చెందిన నైనీ గని నుంచి రోజుకు మూడు నుంచి నాలుగు రైల్వే రేకుల బొగ్గు తరలింపునకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు ఈ గని నుంచి 4.26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును యాదాద్రికి తరలించారు. ఎంసీఎల్, ఎస్ఈసీఎల్ సంస్థల నుంచి విండో–II వేలం విధానంలో మరో 4.6 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు నవంబర్ 4న ఇంధన సరఫరా ఒప్పందాలు కుదిరాయి. ఆయా సంస్థల నుంచి రవాణా ప్రారంభమైంది.

దీర్ఘకాలిక అవసరాల కోసం ఎంసీఎల్, ఈసీఎల్ నుంచి ప్లాంట్‌లోని రెండు యూనిట్లకు ఏడాదికి 7.71 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు స్టాండింగ్ లింకేజ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ఏర్పాట్లు బొగ్గు లభ్యతను మెరుగుపరిచి, ఉత్పత్తిలో అంతరాయాలను తగ్గించేందుకు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు.

నవంబర్ 18 నుంచి దశలవారీ మరమ్మతులు

బొగ్గు నిర్వహణ ప్లాంట్ పనితీరును మెరుగుపరిచేందుకు నవంబర్ 18 నుంచి 24 వరకు తొలి సరఫరా మార్గంలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. ఈ సమయంలో మిగిలిన మూడు మార్గాలను అందుబాటులో ఉంచి నాలుగు యూనిట్ల ద్వారా మొత్తం 2,000 మెగావాట్ల విద్యుదుత్పత్తి కొనసాగించాలని ప్రణాళిక రూపొందించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్‌తో సమన్వయం చేసుకుని ఉత్పత్తిని 1,800 మెగావాట్లకు పరిమితం చేయనున్నారు.

భెల్, టీజీజెన్కో పర్యవేక్షణలో కన్వేయర్ బెల్టులు, ఫీడర్లు, క్రషర్లు, స్టాకర్, రీక్లెయిమర్ తదితర విభాగాల్లో పనులు నిర్వహించనున్నారు. అవసరమైన విడిభాగాలను సిద్ధం చేశారు. మరమ్మతుల అనంతరం తొలి మార్గంలో గంటకు 2,500 టన్నుల బొగ్గు తరలింపు సామర్థ్యాన్ని భెల్ నిరూపించాల్సి ఉంటుంది. అనంతరం మిగిలిన మార్గాల్లోనూ దశలవారీగా పనులు చేపట్టనున్నారు.

నవంబర్ 11న గరిష్ఠ ఉత్పత్తి

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 11న టీజీజెన్కో విద్యుదుత్పత్తి తొలిసారిగా 6,088 మెగావాట్ల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇందులో యాదాద్రి ప్లాంట్ వాటా 2,754 మెగావాట్లు. బొగ్గు సరఫరా వ్యవస్థ పునరుద్ధరణ, ఐదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తితో రబీ సీజన్‌లో 4,000 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు టీజీజెన్కో సన్నద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →