బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

వ్యాపారం

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

సామాజిక భద్రతతో పాటు మహిళా సాధికారత, ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ చేయూత పింఛన్లతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం. సంగారెడ్డి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17: అర

nagendraబుధవారం, 18 నవంబర్ 2026 · 6:06 AM9 వీక్షణలుtrinetnews.com
అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం మునిపల్లి, రాయికోడ్ మండలాల్లో 1,213 మందికి నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

సామాజిక భద్రతతో పాటు మహిళా సాధికారత, ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత

ప్రజలకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యం : మంత్రి దామోదర్ రాజనర్సింహ

చేయూత పింఛన్లతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం.

సంగారెడ్డి, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 17:

అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించి పేద కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మంగళవారం అందోల్ నియోజకవర్గ పరిధిలోని మునిపల్లి మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన చేయూత నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునిపల్లి, రాయికోడ్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేయూత పింఛన్లు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, పేదలకు ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించే సామాజిక భద్రత అని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన విద్య, కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. అనారోగ్యంతో కుటుంబాలు అప్పులపాలు కాకుండా మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలని, ప్రతి గ్రామంలో వైద్య సదుపాయాలను బలోపేతం చేయాలని తెలిపారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందన్నారు.

అందోల్ నియోజకవర్గంలోని 60 గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మారుమూల ప్రాంతాలనే భావన లేకుండా ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటల వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సమయాల్లో రోగులకు సత్వర వైద్య సేవలు అందేలా వైద్యులు, అంబులెన్సులు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. మునిపల్లితో పాటు కంకోల్, సింగీతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందించేలా, వైద్యులు, అంబులెన్సులు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

బుదేరా మహిళా కళాశాలలో అదనపు గదులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ నిధులతో పనులు చేపడుతున్నామని, సీఎస్‌ఆర్ నిధుల ద్వారా కూడా కళాశాల అభివృద్ధికి అదనపు నిధులు సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సింగూరు బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని గ్రామాలకు రవాణా అనుసంధానం పెంచడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చన్నారు. పర్యాటక రంగం, రిసార్టుల అభివృద్ధితో స్థానికులకు, చిన్న వ్యాపారులకు ఉపాధి లభిస్తుందని వివరించారు.

మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. మహిళలు పెట్రోల్ బంకులు, ఇందిరమ్మ క్యాంటీన్లు తదితర వ్యాపార రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. మహిళలు ఆత్మన్యూనత, అభద్రతాభావాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం సాధనలో మహిళలు ముందంజలో ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, ప్రజలకు సేవ చేయడమే తన రాజకీయ ప్రస్థానంలో ప్రధాన లక్ష్యమని తెలిపారు.

జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారునికి చేరేలా చూడటమే అధికారుల లక్ష్యమన్నారు. పింఛన్ అనేది కేవలం డబ్బు మాత్రమే కాదని, దానితో లబ్ధిదారులకు ఆత్మవిశ్వాసం, భద్రత కలుగుతాయని పేర్కొన్నారు. మునిపల్లి మండలంలో 629 మందికి, రాయికోడ్ మండలంలో 584 మందికి కలిపి మొత్తం 1,213 మందికి నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18,591 నూతన పింఛన్లు మంజూరైనట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని లబ్ధిదారులకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి, కలెక్టర్ సూచించారు. ఈ నెల 19వ తేదీ నుంచి పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →