ట్రైనెట్ న్యూస్, నవంబరు 19:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నానికి చెందిన శ్రీ ఎం.ఎన్.ఎల్.వి. ప్రసాద్ రావు గారి కుమారుడు డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు గారు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వైద్యరంగంలో ప్రపంచస్థాయి అరుదైన ఘనతను సాధించినట్లు ఈ ధృవీకరణ పత్రం ద్వారా తెలియజేయడమైనది.
భారతదేశంలోని విశాఖపట్నంలో ఉన్న గోగ్లో క్లినిక్ (GoGlo Clinic) నందు ఒకే రోగికి, ఒకే సెషన్లో అత్యధిక సంఖ్యలో హెయిర్ గ్రాఫ్టులను విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేసి ప్రపంచస్థాయి మైలురాయిని నెలకొల్పారు.
ఈ అత్యంత విశిష్టమైన వైద్య ప్రక్రియలో 13,123 హెయిర్ గ్రాఫ్టులు, సుమారు 26,425 హెయిర్ ఫాలికల్స్‌ను ఒకే రోగికి, ఒకే సెషన్లో విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
సాధారణంగా ఒకే సెషన్లో గరిష్ఠంగా సుమారు 6,000 గ్రాఫ్టుల వరకు ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతుందని విస్తృతంగా నివేదించబడుతున్న నేపథ్యంలో, ఈ అసాధారణ విజయం ఆ పరిమితిని గణనీయంగా అధిగమించి, హెయిర్ రిస్టోరేషన్ వైద్యరంగంలో నూతన ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పింది.
ఈ ఘనత కేవలం ప్రపంచ రికార్డుకే పరిమితం కాకుండా, అత్యంత తీవ్రమైన మరియు అధునాతన దశల్లో జుట్టు రాలిపోయిన రోగులకు మెరుగైన చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి, ఆధునిక పరిశోధనలకు నూతన అవకాశాలను అందించే ఒక చారిత్రాత్మక ముందడుగుగా నిలుస్తుంది.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వైద్యరంగంలో సాధించిన ఈ అసాధారణ విజయాన్ని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (International Genius Book of Records) అధికారికంగా గుర్తించి, తమ రికార్డులలో నమోదు చేసింది.
---
13,123 హెయిర్ గ్రాఫ్టులు | సుమారు 26,425 హెయిర్ ఫాలికల్స్ | ఒకే సెషన్
గోగ్లో క్లినిక్, విశాఖపట్నం, భారతదేశం





