బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

ఆంధ్రప్రదేశ్

తిరుమలలో వైభవంగా పుష్పాలు ఊరేగింపు

nagendraమంగళవారం, 17 నవంబర్ 2026 · 5:01 AM11 వీక్షణలుtrinetnews.com
తిరుమలలో వైభవంగా పుష్పాలు ఊరేగింపు

తిరుమల, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 16:

తిరుమల శ్రీవారి ఆలయంలో కారీక్త మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు సోమవారం తిరుమలలో ఘనంగా జరిగింది.

తిరుమలలోని కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, ఉద్యాన‌వ‌న సిబ్బంది, శ్రీ‌వారి సేవ‌కులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ ఈవో ముద్దాడ రవిచంద్ర మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తరువాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తున్నదన్నారు. శ్రీవారి పుష్పయాగానికి ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి ఐదు టన్నులు, కర్ణాటక నుంచి రెండు టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి రెండు టన్నులు కలిపి మొత్తం 9 టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →