హైద్రాబాద్ , ట్రైనెట్ న్యూస్,నవంబర్ 13 :
మాజీ ఐపీఎస్ అధికారి కారుపోతల బాలకొండయ్య (88) అనారోగ్యంతో కన్నుమూశారు. సికింద్రాబాద్ లోని పద్మారావు నగర్ లో నివసించే ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, నలుగుగు కుమార్తెలు ఉన్నారు. బాలకొండయ్య జన్మస్థలం నెల్లూరు జిల్లా. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఐపీఎస్ గా ఆయన కర్నూలు జిల్లా డి ఐ జి గా పనిచేశారు. ఏ పి ఎస్ ఆర్ టి సి డైరెక్టర్ గా పనిచేసి 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
అనంతరం బీజేపీలో చేరి ఉమ్మడి రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 1998, 2006 లలో నెల్లూరు పార్లమెంట్ స్థానం నుండి బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఉమ్మడి రాష్ట్రం బీజేపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. ఆయన మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు తమ సంతాపం ప్రకటించారు.
అంత్యక్రియలు 15న
బాలకొండయ్య కూతురు అమెరికా నుండి రావలసి ఉన్నందున అంత్యక్రియలు నవంబర్ 15 ఆదివారం జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానం లో జరుగుతాయని ఆయన కుమారుడు కే.శశిధర్ తెలిపారు.





