ట్రైనెట్ న్యూస్, నవంబర్ 13:
పోలీస్ కమిషనర్‌గా నూతనంగా నియమితులైన మహేశ్ మురళీధర్ భగవత్ ఐపీఎస్‌ను సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సయ్యద్ ముజ్జు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ముజ్జు మాట్లాడుతూ.. కృషి, నిజాయితీ, విధుల పట్ల అంకితభావంతో భగవత్ ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమన్నారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు న్యాయం, సురక్షిత సమాజ నిర్మాణంలో ఆయన సేవలు మరింతగా ఉపయోగపడాలని పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజల మన్ననలు పొందాలని ముజ్జు శుభాకాంక్షలు తెలిపారు.





