బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,749+2.09%
NIFTY25,735+2.01%
22K₹1,11,635/10g+0.25%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

ఆంధ్రప్రదేశ్

కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

nagendraగురువారం, 22 అక్టోబర్ 2026 · 2:19 AM16 వీక్షణలుtrinetnews.com
కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 21:

కేంద్రం నుంచి వచ్చే నిధులు అడ్డుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకుండా కుట్రలు చేస్తుందంటూ వైసీపీపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ.. క్రిమినల్ లిటిగెంట్ పార్టీగా మారిపోయిందని విమర్శించారు. వైసీపీ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనమైందని తెలిపారు. బుధవారం నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని అన్నారు. ఈ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం అలవాటుగా పెట్టుకున్నారంటూ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంటూ వైసీపీ సోషల్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, కూటమి నేతలపై వైసీపీ దాడులు చేస్తూ వారే కోర్టును తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రిమినల్ లిటిగెంట్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన సూచించారు. నెల్లూరు రూరల్‌లోని 36 స్థానాల్లో 8 ఏకగ్రీవమయ్యాయని తెలిపారు. మరో 9 స్థానాల్లో వైసీపీ ప్రధాన అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారని చెప్పారు. డమ్మీ అభ్యర్థులు మాత్రమే బరిలో నిలిచారని పేర్కొన్నారు. 17 స్థానాల్లో వైసీపీ పోటీ లేనట్లే అయిందని అన్నారు. నెల్లూరు రూరల్‌లో జెన్‌జీలకు అవకాశం ఇస్తానని తాను ముందే చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భీమినేని వేదశ్రీ 44 డివిజన్ నుంచి అవకాశం ఇచ్చామని.. ఆమె ఎన్నిక ఏకగ్రీవమైందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :