బుధవారం25 నవంబర్ 2026హైదరాబాద్

SENSEX83,819+2.18%
NIFTY25,757+2.10%
22K₹1,12,846/10g+1.36%
భాషలు
సైన్ ఇన్
వెతకండి● లైవ్ టీవీ

ఆంధ్రప్రదేశ్

పోలవరం పనులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా.. ఇప్పటివరకు పనులపై సంతృప్తి ఈ నెల 17 వరకు కొనసాగనున్న ఎనిమిదో విడత పర్యటన

nagendraగురువారం, 15 అక్టోబర్ 2026 · 2:31 AM7 వీక్షణలుtrinetnews.com
పోలవరం పనులను పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా.. ఇప్పటివరకు పనులపై సంతృప్తి ఈ నెల 17 వరకు కొనసాగనున్న ఎనిమిదో విడత పర్యటన

పోలవరం, ట్రైనెట్ న్యూస్, అక్టోబరు 14:

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ పనులను అంతర్జాతీయ నిపుణుల బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లోని గ్యాప్‌-1, గ్యాప్‌-2 ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన నిపుణులు.. అనంతరం జీ హిల్‌ వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను వీక్షించారు. ఆయా ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) ప్రతినిధులు వారికి వివరించారు. ఛాయాచిత్రాల ప్రదర్శన ద్వారా ఇప్పటివరకు చేపట్టిన పనులు, నిర్మాణాల ప్రస్తుత స్థితిగతులను తెలియజేశారు. వీరి పర్యటన సమయంలో కొద్దిసేపు వర్షం కురిసింది. తొలిరోజు పర్యటన అనంతరం నిర్వహించిన సమీక్షలో ఇప్పటివరకు జరిగిన పనుల పట్ల నిపుణులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

తొలుత సమీక్ష.. ఆపై క్షేత్రస్థాయి పరిశీలన

ఢిల్లీ నుంచి రాజమహేంద్రవరం చేరుకున్న అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర జలశక్తి శాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులు అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు కార్యాలయానికి చేరుకున్నారు. వారికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, ఎంఈఐఎల్‌ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం పీపీఏ సీఈఓ సంజీవ్‌ వోహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. గత పర్యటనల్లో నిపుణులు చేసిన సూచనలు, సలహాల మేరకు చేపట్టిన చర్యలు, ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిని అధికారులు వారికి వివరించారు.

ఎనిమిదో విడత పర్యటన

పోలవరం ప్రాజెక్టును ఇప్పటికే ఏడు విడతల్లో సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రస్తుతం ఎనిమిదో విడత పర్యటనలో భాగంగా ప్రాజెక్టు పనులను పరిశీలిస్తోంది. ఈ ఏడాది మే నెలలోనూ నిపుణుల బృందం పోలవరాన్ని సందర్శించింది. గతంలో ఇచ్చిన సూచనలు, సలహాలను అమలు చేసిన తీరు, వాటి ఆధారంగా చేపట్టిన పనుల పురోగతిని ప్రస్తుత పర్యటనలో పరిశీలిస్తోంది. అంతర్జాతీయ నిపుణులు, కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం పర్యటన ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది.

సమావేశంలో పాల్గొన్నవారు

ఈ సమావేశంలో అంతర్జాతీయ నిపుణులు రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌, డేవిడ్‌ పాల్‌ పాల్గొన్నారు. కేంద్ర జలసంఘం డిజైన్స్‌ విభాగం చీఫ్‌ ఇంజినీర్‌ సరబ్జిత్‌ సింగ్‌ బక్షి, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం. రఘురాం, ఉప సంచాలకుడు ఏ. ప్రవీణ్‌, చీఫ్‌ ఇంజినీర్‌ ఎం. రమేష్‌కుమార్‌, సహాయ సంచాలకుడు సీహెచ్‌ సంజీవ్‌, నేషనల్‌ వాటర్‌ సిస్టం డైరెక్టర్‌ పన్నీర్‌ సెల్వం, ఉప సంచాలకులు అశ్వనీకుమార్‌ వర్మ, గౌరవ్‌ తివారీ, సహాయ సంచాలకుడు హేమంత్‌ గౌతమ్‌ పాల్గొన్నారు. అలాగే సి ఎస్ ఎం ఆర్ ఎస్ శాస్త్రవేత్తలు షాహిద్‌ నూర్‌, ఎం.కె. బాషా, ఉదయ్‌ భాను చక్రబోర్తి, వ్యాప్కోస్‌ జనరల్‌ మేనేజర్‌ కేపీఎస్‌ త్యాగీ, ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి, చీఫ్‌ ఇంజినీర్‌ కె. శేషుబాబు, ఎస్‌ఈలు పి. రామచంద్రరావు, డి. తిరుమలరావు, ఈఈలు డి. శ్రీనివాస్‌, ప్రేమ్‌చంద్‌, కె. బాలకృష్ణమూర్తి, ఎంఈఐఎల్‌ జనరల్‌ మేనేజర్‌ ఏవీ గంగాధర్‌కుమార్‌, డీజీఎం మురళి పమ్మి, కోఆర్డినేటర్‌ ఠాగూర్‌ చంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార

మిగతా చదవండి →

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :

మిగతా చదవండి →