నాచారం, ట్రైనెట్ న్యూస్ , సెప్టెంబర్ 9 :
పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) అండగా నిలుస్తోందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. నాచారం, హెచ్ఎంటీ నగర్ డివిజన్ లకు చెందిన పలువురు ఆర్థిక సాయం కోసం ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డిని కలిసి దరఖాస్తు చేసుకున్నారు. వారి అభ్యర్థనలను పరిశీలించిన ఎమ్మెల్యే సీఎం కార్యాలయం ద్వారా రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా చొరవ తీసుకున్నారు. మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బన్నెపాక పరశురాం రూ.42,000, టి. రేఖ రూ.37,500, బి. శశిరేఖ రూ.54,000 చొప్పున చెక్కులు అందజేశారు. మొత్తం రూ.1,33,500 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పేదల పాలిట వరం సీఎం రిలీఫ్ ఫండ్..
BRS leaders distributed CMRF checks worth Rs 1,33,500 to beneficiaries in Nacharam and HMT Nagar divisions, facilitated by Uppal MLA Bandari Laxma Reddy.

ఇవి కూడా చదవండి
4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేశాం.. ఆధారాలు చూపిస్తే కౌశిక్‌రెడ్డి రాజీనామాకు సిద్ధమా?: వొడితల ప్రణవ్

హుజూరాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 23: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గానికి 4,221 కొత్త పెన్షన్లు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార
మిగతా చదవండి →దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

దేవుని తోటలో ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం 201 జంటలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆలయ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ భక్తులకు నలుబోల రాకేష్, సింధు దంపతుల ఆహ్వానం కార్యక్రమంలో పాల్గొన్న దేవాదాయ శాఖ సభ్యులు
మిగతా చదవండి →బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :
మిగతా చదవండి →బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు

బంగారు గొలుసు చోరీ కేసులో నిందితుడి అరెస్టు ఇంటి వద్ద దింపుతానని నమ్మించి మూడు తులాల బంగారు గొలుసు చోరీ చిలకలగూడ పోలీసుల అదుపులో నిందితుడు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, నవంబర్ 24 :
మిగతా చదవండి →